కావ్య మంచి ఫైర్ లా ఉందిగా...ఆమెతో సిగరెట్ వెలిగించుకుందామని
on Mar 19, 2025
సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి శ్రీకర్ కృష్ణ, కావ్య, బ్రహ్మముడి మానస్, వీరేన్ వచ్చారు. దేవుడు నీ ముందు ప్రత్యక్షమైతే ఎం కోరిక కోరుకుంటావ్ అంటూ సుమ అడిగింది. ఆయన్ని చూసేసరికి నాకు ఏమీ గుర్తురాదు అందుకే నేను ఎం కోరుకుంటే అది జరగాలని కోరుకుంటా అని చెప్పింది. దానికి సుమ "నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. మీరు మళ్ళీ ఇంకో సారి వస్తారా " అని అడిగేలా ఉంది. అనేసరికి కావ్య నవ్వేసింది. ఇక మానస్, శ్రీకర్ కృష్ణ ఇద్దరూ కూడా సమ్మర్ బాచిలర్ పార్టీ చేసుకున్నారు.
మందేస్తూ స్టేజి మీద చిందేశారు. వీరేన్ - కావ్య ఒక జోడిగా వచ్చారు. ఇక శ్రీకర్ వచ్చి "మేడం మీరు నా కోసం సిగరెట్ వెలిగిస్తారా ? అని అడిగాడు. ఇంతలో వీరేన్ వచ్చి "హలో హలో నా వైఫ్ నీకు సిగరెట్ ఎందుకు వెలిగిస్తుంది ?" అంటూ శ్రీకర్ ని అడిగాడు. "అంటే మేడం చూడడానికి ఫైర్ లా ఉన్నారు కదా. ఆ ఫైర్ తో సిగరెట్ వెలిగించుకుందామని" అనేసరికి కావ్య కూడా నవ్వేసింది. ఇక సుమ రాపిడ్ ఫైర్ రౌండ్ లో కావ్యని ఒక ప్రశ్న అడిగింది. "జీవితంలో ఎలాంటి లైఫ్ లీడ్ చేయడం బెటర్...లవ్ లైఫ్ ఆర్ మ్యారేజ్ లైఫ్ " అని అడిగింది. ఆ కపుల్ మీద ఆ విషయం డిపెండ్ అయ్యి ఉంటుంది. మ్యారేజ్ లైఫ్ ఐనా లవ్ లైఫ్ ఐనా కూడా ప్రేమ ఉంటె ఏ లైఫ్ ఐనా లీడ్ చేయొచ్చు " అని ఆన్సర్ ఇచ్చినట్టుగా ఆమె లిప్ సింక్ ద్వారా తెలుస్తోంది. ఇక ఈ ప్రోమోలో ఫైనల్ గా సుమ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసారు. సుమ బర్త్ డే సెలెబ్రేషన్స్ చేశారు అంతా కలిసి. అలాగే సుమ వాళ్ళ అమ్మను కూడా ఈ షోకి తీసుకొచ్చారు. ఈరోజు తాను ఇలా ఉంది అంటే దానికి కారణం తన తల్లి అని చెప్పుకొచ్చింది సుమ.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
